GK BITS IN TELUGU -1

Gk bits in telugu -1 - bikki news

BIKKI NEWS : GK BITS IN TELUGU – Part 1

GK BITS IN TELUGU – 1

1) ఏడుపాయల జాతర జరిగే స్థలము ఏది.?
జ : నాగసానిపల్లె

2) దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం పేరు ఏమిటి?
జ : పుటాకార దర్పణం

3) తెలంగాణ ఎన్జీవో సంస్థ స్థాపించినది ఎవరు?
జ : ఆకుల భూమయ్య

4) తెలంగాణ స్టడీ సర్కిల్ స్థాపించినది ఎవరు.?
జ : గాదె ఇన్నయ్య

5) 1969 ఏప్రిల్ లో ముల్కీ నిబంధనలు కొనసాగటానికి తగు రాజ్యాంగ సవరణ సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు.?
జ : కే.ఎన్. వాంఛూ

6) కాకతీయ రాజులలో ఎవరు కేసముద్రం చెరువును తవ్వించారు.?
జ : ప్రోలరాజు – 1

7) 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో సందర్భంగా నిజాం సైన్యం లొంగిపోయింది. అప్పుడు ఆ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు.?
జ : ఎల్ ఎడ్రాస్

8) భారతదేశంలో మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స మొట్టమొదటిసారిగా ఏ వైద్యశాలలో జరిగింది.?
జ : వెల్లూరు

9) ఎండమావులు ఏ కాంతి ధర్మం వలన ఏర్పడతాయి.?
జ : సంపూర్ణాంతర పరావర్తనము

10) రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ : ఫాహియాన్

11) చౌరీ చౌరా ఉదంతంతో స్వతంత్ర సమరంలోని ఏ ఉద్యమం ఆగిపోయింది.?
జ : సహాయ నిరాకరణ ఉద్యమం

12) రక్తంలో అధిక ద్రావణీయత ధర్మం కలిగి ఉన్న కారణంగా ఏ వాయువును సముద్రం లోతులకు వెళ్లే ఈతగాళ్లకు ఆక్సిజన్ సిలిండర్ లో 20% కలిపి ఇస్తారు.?
జ : హీలియం

13) విమానాల తయారీలో ఉపయోగించే ప్రధాన లోహం ఏమిటి .?
జ : డ్యూరాల్యుమిన్

14) లోహాలను పలచటి రేకులుగా మార్చే ధర్మాన్ని ఏమని అంటారు.?
జ : డక్ట్రెలిటి

15) సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను నిర్ణయించు అధికారం ఎవరికి కలదు.?
జ : పార్లమెంట్ చట్టం ద్వారా

16) పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినాడు.?
జ : రెండవ దేవరాయలు

17) బెంగాల్ లో ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : రాబర్ట్ క్లైవ్

18) వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితులు మ్యాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు.?
జ : జర్మనీ

19) గంగా మైదానంలో కొత్త ఓండ్రు నేలకు పేరు ఏమిటి?
జ : ఖాదర్

20) హోలీ పండుగ వేడుకలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు.?
జ : మహమ్మద్ బిన్ తుగ్లక్

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →