Free Polytechnic – ఆ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ విద్య

BIKKI NEWS (JULY 16) free polytechnic education for govt students. తెలంగాణ రాష్ట్రంలోని పాలిసెట్ 2025 సీట్లు కేటాయించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

free polytechnic education for govt students

జిల్లా పరిషత్తు పాఠశాలలు, గురుకులాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే.. వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు.

అలాగే పాలిసెట్ లో 1000లోపల ర్యాంకు పొందిన విద్యార్థులకూ పాలిటెక్నిక్ ఫీజు ఎంతున్నా సర్కారు పూర్తిగా మంజూరు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి బోధనా రుసుములు చెల్లిస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.14,900 మాత్రమే ఫీజు రీయింబర్స్మెం ట్ గా చెల్లించనున్నారు.

గతంలో పాలిటెక్నిక్ కు గరిష్ఠంగా రూ.14,900 ఫీజు ఉండేది. దాన్ని ప్రభుత్వం రూ.39,000 పెంచింది. దాంతో ఫీజు రీయింబర్స్మెంట్ పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

https://bikkinews.in/polycet-2025-seat-allotment/