BIKKI NEWS (JULY 25) : free aadhar update for inter students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రభుత్వ అనుబంధ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ఆధార అప్డేషన్ ప్రక్రియను ఇంటర్మీడియట్ బోర్డ్ చేపట్టింది.
free aadhar update for inter students.
ఆధార్ అప్డేషన్ ఏజెన్సీ లతో ఒప్పందం చేసుకుని నేరుగా కళాశాలలోనే ఆధార్ అప్డేషన్ ప్రక్రియను విద్యార్థులకు కల్పించనున్నారు.
ఆధార్ అప్డేషన్ ప్రక్రియకు నామినల్ చార్జీలను వసూలు చేయనున్నారు.
అలాగే మొదటిసారి బయోమెట్రిక్ అప్డేషన్ చేస్తున్న 15 నుంచి 17 సంవత్సరాల విద్యార్థులకు ఈ ప్రక్రియను ఉచితంగా చేయనున్నారు.
పదో తరగతి మెమో ప్రకారం ఆధార్ కార్డులో వివరాలు సరి చేసేందుకు ఇది మంచి అవకాశమని, దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆధార్ అప్డేషన్ ప్రక్రియతో యుడైస్ లో వివరాలు నమోదు చేయడం సులభం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.