- BIKKI NEWS : 13 JAN. 2016
Exemption of govt junior colleges staff from election duties. ఇంటర్ పరీక్షల విధుల్లో ఉన్న ప్రభుత్వ , ప్రభుత్వ రంగ జూనియర్ కాలేజీ సిబ్బందికి ఎన్నికల డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇంటర్మీడియట్ బోర్డు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Exemption of govt junior colleges staff from election duties
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ జూనియర్ కాలేజీల సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కోరింది.
ఇంటర్ పరీక్షల సమయంలో కో-ఆర్డినేషన్, ఇన్విజిలేషన్, సూపర్విజన్, ఎగ్జామినేషన్ నిర్వహణ వంటి కీలక బాధ్యతల్లో సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఈ నేపథ్యంలో, మునిసిపల్, అర్బన్ లోకల్ బాడీ, MPTC, ZPTC ఎన్నికల విధులను అప్పగించవద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం విశ్వసించే విధంగా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న బోర్డు, పరీక్షల ప్రశాంత నిర్వహణకు సహకరించాలని ఎన్నికల శాఖను కోరింది.
ఇంటర్ ప్రాక్టికల్ & థియరీ పరీక్షల షెడ్యూల్
- ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: 21-01-2026
- సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: 22-01-2026
- ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష: 23-01-2026
- ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష: 24-01-2026
- ప్రాక్టికల్ పరీక్షలు: 02-02-2026 నుంచి 21-02-2026 వరకు
- థియరీ పరీక్షలు: 25-02-2026 నుంచి 18-03-2026 వరకు

