BIKKI NEWS (DEC. 20) : Equal pay for equal work for out sourcing employees. రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించకపోవడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Equal pay for equal work for out sourcing employees
డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ ఈ అంశాన్ని పరిశీలించింది. ఇరవై సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న తమకు G.O.Ms.No.60 ప్రకారం నెలకు రూ.15,600/- వేతనం చెల్లించాల్సి ఉండగా, తమకు కేవలం రూ.11,050/- మాత్రమే చెల్లిస్తున్నారని ఉద్యోగులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే విధమైన విధులు నిర్వహిస్తున్న ఇతర శాఖల ఉద్యోగులకు ఎక్కువ వేతనం అందుతున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ పరిస్థితి ఉద్యోగుల జీవనోపాధి హక్కు, గౌరవంతో జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ అంశంపై సమగ్ర విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్, తెలంగాణ సర్వశిక్ష అభియాన్ (TSSA) ఎక్స్-ఆఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో పాటు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నుంచి సవివర నివేదికను కోరింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కోసం కేసును 2026 జనవరి 5వ తేదీకి వాయిదా వేసినట్లు కమిషన్ తెలిపింది.

