ENG VS SA : ఇంగ్లాండ్ రికార్డు గెలుపు

England won by 342 runs against South Africa

BIKKI NEWS (SEP. 07) : England won by 342 runs against South Africa. సౌతాఫ్రికా తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు రికార్డు విజయం సాధించింది. ఆ జట్టు ఏకంగా 342 పరుగుల తేడాతో గెలిచి, భారీ తేడాతో గెలిచిన జుట్టు గా రికార్డు సృష్టించింది.

England won by 342 runs against South Africa

సౌతాఫ్రికా 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఘోర పరాజయం పాలైంది.. ఆ జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) మాత్రమే. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు . దీంతో 342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది..

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.