ENGINEERING MOCK SEATS – ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు

BIKKI NEWS (JULY 12) : Engineering mock seats allotted. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపును ఈరోజు సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది.

Engineering mock seats allotted

విద్యార్థులకు తాము ఎంచుకున్న వెబ్ ఆప్షన్ లలో తమ ర్యాంకుకు అనుగుణమైన కాలేజీను కేటాయిస్తూ విద్యార్థులకు మెసేజ్ లు వచ్చాయి.

అయితే ఇది కేవలం మాక్ సీట్లు మాత్రమే, ఈ సీట్లపై ఇంట్రెస్ట్ లేని విద్యార్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు‌. తద్వారా ఫైనల్ సీట్ అలాట్మెంట్ లో ఉత్తమ కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది.

ఒకవేళ విద్యార్థులకు తమకు కేటాయించిన కాలేజీ నచ్చితే వెబ్ ఆప్షన్ లో ఎలాంటి మార్పు చేయకుండా ఉంటే అదే సీటు ఉంటుంది.