ENGINEERING – కౌన్సిలింగ్ లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్

BIKKI NEWS (JULY 11) : Engineering mock seat allotment 2025. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు ముగిసింది. ఈసారి నూతనంగా విద్యార్థులకు మాక్ సీట్ల కేటాయింపు ఉండనుంది. దీంతో విద్యార్థులు ముందుగానే తమకు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో, ఏ కోర్సులు సీటు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.

Engineering mock seat allotment 2025.

జూలై 13లోపు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందని కన్వీనర్ తెలిపారు.

ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని తెలిపారు.

మాక్ సీట్ల కేటాయింపులు విద్యార్థులకు నచ్చిన కాలేజ్ లేదా కోర్సు రాకపోతే మరొకసారి వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

దీంతో విద్యార్థులు మరింత మెరుగైన కాలేజ్, మెరుగైన కోర్సును పొందే అవకాశం ఉంటుంది.