BIKKI NEWS (DEC. 31) : Employees Aadhar data mistakes in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఆధార్ వివరాలను సేకరిస్తున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అన్ని రకాల ఉద్యోగులు కలిపి నాలుగు లక్షల మంది ఉద్యోగుల ఆధార్ పేర్లు, వేతనం పోందుతున్న రిజిస్టర్ లో పేర్లు, ఫోన్ నెంబర్లు మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించారు.
Employees Aadhar data mistakes in Telangana.
దీంతో వెంటనే వారి ఆధార్ లోని తప్పులను సరిచేసూకోవడినికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అర్ధక శాఖ భావిస్తోంది.
ఈ ఉద్యోగులందరిని నకిలీ ఉద్యోగులు అని చెప్పలేమని కావున వివరాలను మరోసారి సరి చూడాలని తెలిపారు.
ఒకవేళ నకిలీ ఆధార్ సమర్పిస్తే వారి డేటాను సేకరించాలని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ తెలిపింది.
డిసెంబర్ 31 కల్లా అన్ని ప్రభుత్వ శాఖలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల ఆధార్ వివరాలను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

