ELECTION CODE – అమల్లోకి ఎన్నికల కోడ్

BIKKI NEWS (SEP. 29) : Election code in Telangana. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Election code in Telangana.

ఎన్నికల కోడ్ నవంబర్ 11వ తేదీ వరకు ఉండనుంది. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ఫలితాలను ప్రకటించనుండడంతో ఎన్నికల కోడ్ ముగియనుంది.

గ్రామపంచాయతీలకు మూడు దశలలు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు దశలలో ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఎంపీటీసీ, జడ్పిటిసి లకు అక్టోబర్ 23, 27వ తేదీలలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 11వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.

గ్రామపంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8వ తేదీలలో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలవడనున్నాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK