DOST 2025 – ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం

BIKKI NEWS (JULY 25) : DOST 2025 SPECIAL PHASE COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రదేశాలకు దోస్త్ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ నేటి నుండి మొదలు కానుంది.

DOST 2025 SPECIAL PHASE COUNSELLING.

ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్లో నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు పొందే అవకాశాన్ని కల్పించారు. ఈసారి కౌన్సిలింగ్ లో ఎర్త్ యూనివర్సిటీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు

జులై 31వ తేదీ వరకు 400/- రూపాయల రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ లో ఇచ్చేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది.

జులై 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేయబడతారు ఆగస్టు 3వ తేదీన ఈ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆగస్టు ఆరో తేదీ వరకు సీట్లు వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ కౌన్సిలింగ్ అయిపోయాక సీట్లు మిగిలిపోతే ఆగస్టు 11, 12 తేదీల్లో కళాశాలల్లోనే స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.