- BIKKI NEWS : 26-01-2026
Daily Gk Bits 88 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily Gk Bits 88 for compititive exams
1) జయ భారత రెడ్డి కమిటీ ఏ అంశం కొరకు నియమించారు.?
జ : ఆంధ్రప్రదేశ్ లో నియామకాలు
2) తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ ఐక్య వేదికను ప్రారంభించడంలో కీలక వ్యక్తి ఎవరు.?
జ : బి. ప్రకాష్
3) తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ యొక్క ఒక అధ్యాయం చీకటి అధ్యాయంగా పిలవబడింది. ఎందుకంటే అధ్యాయాన్ని ప్రజలకు బహిర్గత పరచలేదు. అది ఏ అధ్యాయం.?
జ : 8వ అధ్యాయం
4) తెలంగాణ డిమాండ్ ను పరిశీలించడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2004
5) సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలను కాలానుగుణంగా అమర్చండి.? ఝాన్సీ, లక్నో, ఢిల్లీ, కాన్పూర్.?
జ : ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ.
6) బెంగాల్ విభజనను చేసిన రాజ ప్రతినిధి ఎవరు.?
జ : కర్జన్
7) మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు.?
జ : 1996
8) ఏ జిల్లాలో జోగిని వ్యవస్థ అసలు కనబడదు.?
జ : ఖమ్మం
9) గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారాలు కలవు.?
జ : ఎనిమిది
10) ‘హంపి నుండి హరప్ప దాకా’ గ్రంథకర్త ఎవరు.?
జ : తిరుమల రామచంద్ర
11) మొహమ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఏ యుద్ధంలో ఓడించాడు.?
జ : మొదటి తరైన్ యుద్ధం
12) ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
జ : రఘుపతి వెంకటరత్నం నాయుడు
13) భారత దేశానికి పోలీస్ వ్యవస్థను పరిచయం చేసింది ఎవరు.?
జ : కారన్ వాలిస్
14) తెలంగాణ జనసభ యొక్క అధికారిక పత్రిక పేరు ఏమిటి?
జ : జన తెలంగాణ
15) 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం.?
జ : కొవ్వును పులిమిన తూటాల ఉదంతం
16) షాదీ ముబారక్ ప్రారంభించిన తేదీ ఏది.?
జ : 2014 – అక్టోబర్ – 02
17) సబ్సిడీలపై గొర్రెల పంపిణీ మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2017 – జూన్ -20
18) ఒంటరి మహిళలకు ఆసరా పథకం ఏపుడు ప్రారంభించారు.?
జ : 2017 – ఎప్రిల్ – 01
19) ఆరోగ్యలక్ష్మి ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2015 – జనవరి – 01
20) సరిగా నిల్వ చేయని వేరుశనగల వల్ల ఏ టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.
జ : అప్లటాక్సిన్
21) బ్రంట్ ల్యాండ్ కమిషన్ గా పిలవబడే పర్యావరణ మరియు అభివృద్ధిపై ప్రపంచ కమీషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది.?
జ : 1987
22) జీవ వైవిధ్య చట్టం ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది.?
జ : 2001
23) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
24) దాశరధి కృష్ణమాచార్య ఏ రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.?
జ : తిమిరంతో సమరం
25) పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ‘భగేలా’ అంటే ఎవరు.?
జ : కట్టుబడిన కార్మికుడు
26) కాంతి తీవ్రతను అలిచే పరికరం పేరు ఏమిటి.? జ : ఫోటో మీటర్
27) దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఏమవుతుంది.? జ : తగ్గుతుంది
28) సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి రుజువర్తనం
29) త్రీ డైమెన్షనల్ ఫోటోలను చూడ్డానికి ఉపయోగించే పరికరం ఏంటి.? జ : స్టీరియోస్కోప్
30) సహజ వీడియో ధార్మికతమ ప్రదర్శించే మూలకాల పరమాణు సంఖ్య ఎంతకంటే ఎక్కువగా ఉంటుంది.? జ : 82

