- BIKKI NEWS : 20-01-2026
DAILY GK BITS 82 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS 82 FOR COMPITITIVE EXAMS
1) భూమిలో ఉండే ఏ పొరల కదలిక వలన భూకంపం సంభవిస్తుంది.?
జ : భూపటలం
2) ఎండమావులు కనిపించడానికి కారణం.?
జ : సంపూర్ణాంతర పరావర్తనం
3) ఏ గ్రహన్ని వేగుచుక్క అని పిలుస్తారు.?
జ : శుక్రుడు
4) బాహ్య మరియు అంతర ఉద్దీపనలకు స్పందించే కణజాలం ఏది.?
జ : నాడీ కణజాలం
5) రెడ్ డేటా బుక్ ను ఎవరు ప్రచురిస్తారు.?
జ : IUCN
6) 5000 నుంచి ఒక లక్ష వరకు జనాభా గల ప్రాంతాలను ఏమని అంటారు.?
జ : పట్టణాలు
7) జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
8) అంత్యోదయ అన్న యోజన పథకం ఎవరికి సంబంధించినది.?
జ : పేదవారిలో అత్యంత పేదవారు
9) జర్మనీ పార్లమెంట్ దిగువ సభ పేరు.?
జ : రిచ్‌స్టాగ్
10) అమెరికా స్వతంత్ర ప్రకటన యొక్క ప్రధాన రచయిత.?
జ : థామస్ జెపెర్సన్
11) బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌల ను ఆంగ్లేయులు ఏ యుద్ధంలో ఓడించారు.?
జ : ప్లాసీ యుద్ధం
12) భారత రాజ్యాంగం ప్రకారం బిరుదుల రద్దు అనేది దీనిలో ఒక భాగము.?
జ: సమానత్వపు హక్కు
13) అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : డిజిట్ ఆల్ : లింగ సమానత్వానికై ఆవిష్కరణ మరియు సాంకేతికత
14) బాలల వాతావరణ ప్రమాద సూచికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 26
15) భూపేన్ హాజరికాకు ఏ రంగంలో చేసిన కృషికి గాను భారతరత్న ఇచ్చారు.?
జ : సంగీతం
16) శత పత్రం పుస్తకం రచయిత ఎవరు.?
జ : గడియారం రామకృష్ణ శర్మ
17) జులై 1954లో కరీంనగర్ కు వచ్చిన ఫజల్ అలీ కమిషన్ కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది ఎవరు.?
జ : కాళౌజి నారాయణరావు
18) 1968 జులై 10న ఏ దినంగా పాటించారు.?
జ : తెలంగాణ హామీల దినము
19) తెలంగాణ ప్రాంతీయ సమితి ఎక్కడ ఏర్పాటు చేయబడింది.?
జ : ఇల్లందు
20) 1969 లో జీవో నెంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంజ్ అధిపతి ఎవరు?
జ : జస్టిస్ ఎం. హిదయతుల్లా
21) తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్ లో కేంద్రం జస్టిస్ వాంఛ్ అధ్యక్షునిగా ఇద్దరు సభ్యులతో కమిటీని వేసింది. ఆ ఇద్దరు సభ్యులు ఎవరు.?
జ ‘ ఎంసీఏ సెటల్‌వాడ్ మరియు నెరెండే
22) 1975 అక్టోబర్ లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371- డి ని విడుదల చేసింది.?
జ : జీవో నెంబర్ 674
23) తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ను రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ : ఏన్టీ రామారావు
24 ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల విస్తీర్ణాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు, పేర్లు మార్చవచ్చు.?
జ : ఆర్టికల్ – 3
25) తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు గ్రంధాన్ని రచించింది ఎవరు.?
జ : ఆదిరాజు వెంకటేశ్వరరావు
26) తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు.?
జ : మార్చి – 1 – 2014
27) లక్నో ఒప్పందం తర్వాత హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారి అను బిరుదు ఎవరికి ఇవ్వబడింది.?
జ : మొహమ్మద్ అలీ జిన్నా
28) శాసనల్లోంఘన ఉద్యమమును గాంధీజీ ఎప్పుడు విరమించాడు.?
జ : ఏప్రిల్ 1934
29) ప్రముఖ బెంగాలీ నాటకం నీలి దర్పణ్ ఇంగ్లీష్ భాష లోకి అనువదించింది ఎవరు?
జ : మైకెల్ మధుసూదన్ దత్తా
30) ఏవో హ్యూమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్ లో ముఖ్యపాత్ర నిర్వహించిన బ్రిటిష్ ఎవరు.?
జ : విలియం వెడర్ బర్న్

