BIKKI NEWS : DAILY GENERAL KNOWLEDGE BITS 109 – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్
DAILY GENERAL KNOWLEDGE BITS 109
1) తేయాకు ను అధికంగా పండించే రాష్ట్రం ఏది.?
జ : అసోం
2) కాఫీ మొక్క శాస్రీయ నామం ఏమిటి.?
జ : కాఫీయా అరబికా
3) దేశంలో కాఫీ పంటకు ప్రసిద్ది చెందిన కొండలు ఏవి.?
జ : బాబా బుడాన్ కొండలు
4) కాఫీ ను అధికంగా పండించే రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక
5) ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : భారతదేశం
6) భారతదేశంలో వరి, గోధుమ తర్వాత ముఖ్యమైన ఆహార పంట ఏది.?
జ : జొన్న
7) ఫింగర్ మిల్లెట్, ఆఫ్రికన్ మిల్లెట్ అని ఏ చిరుధాన్యానికి పేరు.?
జ : రాగులు
8) చెరకు శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : శాకారమ్ అఫిసినేరమ్
9) తెలుగులో తొలుత అచ్చయిన గ్రంథం ఏది.?
జ : బైబిల్
10) ఏ సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది.?
జ : 1918
11) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1938
12) కాకతీయుల కాలంలో “మేరుక” అనేది దేనిమీద వేసే పన్ను.?
జ : మాగాణి భూములు
13) హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత ఎవరు.?
జ : చిన్ ఖిలిచ్ ఖాన్
14) వాంఛూ కమిటీ ఏర్పాటు లక్ష్యం ఏమిటి.?
జ : ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం
15) విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు.?
జ : కమ్యూనిస్టు పార్టీ
16) నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1955
17) పాలమూరు చరిత్ర అనే చారిత్రక పరిశోధన గ్రంథ రచయిత ఎవరు?
జ : బాబు దేవిదాస్ రావు
18) సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఏ పేరుతో తెలంగాణ సాహిత్య చరిత్రను అందించారు.?
జ : ముంగిలి
19) నిజాం రాజ్యం భారత ప్రభుత్వంతో ఏ సంవత్సరంలో యధాతదపు వడంబడిక చేసుకుంది.?
జ : 1947 నవంబర్ 29
20) ఎవరి కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది.?
జ : ఇబ్రహీం కుతుబ్ షా
21) ఐక్యరాజ్య సమితిని ఏరోజు ఏర్పాటు చేశారు.?
జ : అక్టోబర్ 24 – 1945
22) ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : న్యూయార్క్ – అమెరికా
23) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో ఎన్ని సభ్య దేశాలు కలవు.?
జ : 15
24) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో ఎన్ని శాశ్వత సభ్యు దేశాలు కలవు.?
జ : 5
25) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ :ఎప్రిల్ – 07
26) ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 05
27) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 10
28) ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో శాశ్వత సభ్యు దేశాలు ఏవి.?
జ : అమెరికా, బ్రిటన్, రష్యా, ప్రాన్స్, చైనా
29) ఏ కాకతీయ పాలకుడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉంది?
జ : మొదటి ప్రతాపరుద్రుడు
30) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భాగ్యనగర్ రేడియో’ పేరుతో రహస్య రేడియోను ఎవరి నాయకత్వంలో నిర్వహించారు?
జ : పాగా పుల్లారెడ్డి

