BIKKI NEWS (NOV. 20) : Contract and out sourcing employees in telangana. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎందరు విధుల్లో ఉన్నారనే సంఖ్య తేలడం లేదు.
Contract and out sourcing employees in telangana
దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఏయే శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారో వారికి జీతం ఎంత చెల్లిస్తున్నారో, ఎన్ని నెలల వేతనం తీసుకున్నారో, పెండింగ్ ఎంత ఉందో అనే వివరాలు సేకరిస్తున్నాయి.
కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం కొన్ని శాఖల్లో దొరకడం లేదని చెబుతున్నాయి.
ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల సంఖ్యను తేల్చడానికి కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే

