BC EMPLOYEES – సెప్టెంబరు 15 లోగా బీసీ ఉద్యోగుల సమాచారం ఇవ్వాలి

BIKKI NEWS (AUG. 26) : BC EMPLOYEES INFORMATION. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బీసీ ఉద్యోగుల సమాచారాన్ని సెప్టెంబరు 15 వ తేదీలోగా బీసీ కమిషన్ కు అందించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అధికారులకు సూచించారు.

BC EMPLOYEES INFORMATION.

6 నెలల క్రితం బీసీ కులాలకు చెందిన ఉద్యోగులు సమాచారమివ్వాలని కోరినా, పూర్తి సమాచారం ఇవ్వలేదని. ఇక నుండి ప్రతి సంవత్సరం మార్చి 31న బీసీ ఉద్యోగుల పూర్తి సమాచారం అందించాలని తెలిపారు.

“కమిషన్ తీసుకున్న సమాచారం మేరకు బీసీల సామాజిక, విద్య, ఆర్థికాభివృద్ధికి అవసరమైన సూచనలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని. కొన్ని చిన్న కులాలకు అవకాశాలు లభించడం లేదని, బీసీల్లోని కొన్ని పెద్ద కులాలే ఎక్కువ లాభాలు పొందుతున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, బీసీ జాబితాను పునర్ వర్గీకరణ చేయాలని కోరారు” అని నిరంజన్ తెలిపారు.