గెజిటెడ్ భవన్ లో బతుకమ్మ పండుగ పోస్టర్ విడుదల

BIKKI NEWS (SEP. 21) : BATHUKAMMA POSTER UNVEILED AT TGO BHAVAN. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బత్కమ్మ వేడుకలు పోస్టర్ ను గెజిటెడ్ భవన్ లో ఘనంగా ఆవిష్కరించారు

BATHUKAMMA POSTER UNVEILED AT TGO BHAVAN.

ఈ కార్యక్రమంలో టిజిఓ అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు ,ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ,మహిళా విభాగ అధ్యక్ష్య కార్యదర్శులు డా. జి. దీపా రెడ్డి ,జే.సుజాత ల మరియు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు డా. జి. దీపారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక కేతనంగా విరాజిల్లుతున్న బత్కమ్మ వేడుకలలో మహిళా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ప్రకృతిని ,మానవ సంబంధాలను ,సంక్షేమాన్ని బలోపేతం చేసే విశిష్టమైన బత్కమ్మ సంస్కృతి తెలంగాణ ను ప్రపంచంలో గర్వంగా నిలబెట్టిందని అన్నారు .మానవాళి మనుగడకు ఆధారాన్ని ఇస్తున్న భూమాత ను రక్షించుకోవాలనే సంకల్పం బత్కమ్మ కు ఉందన్నారు.
మన ఉనికి మన ఆత్మగౌరవం ఘనత కు దోహదపడుతున్న బత్కమ్మ వేడుకలను ఉద్యమ స్థాయిలో జరుపుకోవాలని,రాబోయే తరాలకు ఈ అపురూప సంప్రదాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో మహిళా ఉద్యోగులందరూ ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భగా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను తేదీ 27 అక్టోబర్ 2024 రోజున తెలంగాణ గెజిటెడ్ భవన్ కార్యాలయం, గృహకల్ప సముదాయం, నాంపల్లి హైదరాబాద్ నందు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా అధికారిణిలు శాంతిశ్రీ,శిరీష, లావణ్య, సుజాత, పూనమ్, జయశ్రీ, రేవతి, ఏoజుల రెడ్డి,చైతన్యసునీత ,శ్రీ ప్రియ , మహేశ్వరి ,విజయలక్ష్మి, వసుందర, లలిత, అలివేలు తదితరులు పాల్గొన్నారు.