Hyderabad Beach – హైదరాబాద్ కి బీచ్

BIKKI NEWS (AUG. 28) : Artificial beach at Hyderabad. సముద్రం లేని హైదరాబాద్ మహా నగర పౌరులకు బీచ్ ను, ఆ వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Artificial beach at Hyderabad.

ఈ మేరకు హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇందుకోసం సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి నిర్మాణం మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

ఈ కృత్రిమ బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నట్లు తెలుస్తోంది.