AROGYA SRI BANDH – ఆరోగ్య శ్రీ సేవలు బంద్

BIKKI NEWS (SEP. 16) : Arogya sri services bandh in telangana. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి.

Arogya sri services bandh in telangana

తమకు ప్రభుత్వం నుండి 1400 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘ ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ కు తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి..