APPRENTICE – ఎలాంటి పరీక్ష లేకుండా 1010 అప్రెంటిస్ అవకాశాలు

BIKKI NEWS (JULY 15) : Apprentice in railway integral coach factory. చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 2025-26 సంవత్సరానికి 1,010 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేసింది.

Apprentice in railway integral coach factory

ట్రేడుల వివరాలు :

  • కార్పెంటర్,
  • ఎలక్ట్రిషియన్,
  • ఫిట్టర్,
  • మెషినిస్ట్,
  • పెయింటర్,
  • వెల్డర్,
  • ఎంఎల్డీ రేడియాలజీ,
  • ఎంఎల్ పాథాలజీ,
  • పీఏఎస్ఏఏ.

అప్రెంటిస్ వ్యవధి : టెన్త్, ఇంటర్ ఫ్రెషర్స్ కు రెండేళ్లు, ఐటీఐ పూర్తి చేసిన వారికి ఏడాది పాటు అప్రెంటిస్ ఉంటుంది.

అర్హతలు : ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్టు 11 – 2025 నాటికి ఐటీఐ చదివితే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఐటీఐ లేకపోతే 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్ : నెలకు 6,000/- నుంచి 7,000/- వరకు

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : 100/-.( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 11 – 2025.

వెబ్సైట్ : https://icf.indianrailways.gov.in/