BIKKI NEWS (JULY 24) : AI Facial attendance for intermediate students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఫేసియల్ అటెండెన్స్ ను అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.
AI Facial attendance for intermediate students.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ అటెండెన్స్ RNIT AI SOLUTIONS సంస్థకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంస్థ వారం పది రోజులలో కళాశాలకు ఫెసియల్ అటెండెన్స్ పరికరాలను సరఫరా చేయనున్నట్లు సమాచారం.
ఈ అటెండెన్స్ ఆధారంగానే విద్యార్థులకు స్కాలర్షిప్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కావున విద్యార్థులు కనీసం 70 శాతం అటెండెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది.
అలాగే పరీక్ష పేరు చెల్లించుటకు కూడా కనీసం 70 శాతం హాజరు విద్యార్థులు కలిగి ఉండాలి.