- BIKKI NEWS : 24-01-2026
జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
National Girl Child Day
ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది.
సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు.
సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరం. సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగుతుంది
- Kashi Tamil Sangamam 5.0 Telugu – 14 ప్రత్యేక రైళ్లు ప్రారంభం – తెలంగాణ, ఏపీలో ఆగే స్టేషన్లు
- Telangana Graduate MLC Draft Voter List 2026 – లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలంటే?
- eHRMS Portal Telangana Govt Employees Services IFMIS – ఉద్యోగుల సేవలన్ని ఇక ఆన్లైన్ లోనే
- Death Gratuity Family Pension for CPS employees – సీపీఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్
- Contract Workers Children Free Education – కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య

