- BIKKI NEWS : 23-01-2026
Tom Tom Traffic index 2025. ప్రపంచంలో అత్యంత రద్దీ నగరాల జాబితాను నెదర్లాండ్స్ కు చెందిన సంస్థ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదికను విడుదల చేసింది.
Tom Tom Traffic index 2025.
అత్యంత రద్దీ ఉండటం వలన నెమ్మదిగా ప్రయాణాలు జరిగే నగరాల జాబితాను ఈ సంస్థ ప్రతి ఏటా వెల్లడిస్తుంది.
48 దేశాల్లోని 492 నగరాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
Table of Contents
ఈ నివేదిక ప్రకారం మెక్సికో సిటీ ప్రపంచంలో అత్యంత రద్దీగల నగరంగా మొదటి స్థానంలో నిలిచింది.
భారత్ కు చెందిన బెంగళూరు నగరం ప్రపంచంలో అత్యంత రద్దీ గల నగరాలలో రెండవ స్థానంలో నిలవడం విశేషం.
ఈ నివేదికలో హైదరాబాద్ నగరం 47 వ స్థానంలో నిలిచింది.
పుణె 5వ స్థానంలో, ముంబయి 18, దిల్లీ 23, కోల్ కతా 29, జైపుర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచాయి.
బెంగళూరులో రద్దీ సమయంలో గంటకు ప్రయాణించే దూరం 16.6 కి.మీ.లకు మించడం లేదు. ఉదయం ఈ దూరం గంటకు 14.6 కి. మీ. పడిపోగా సాయంత్రానికి కేవలం 13.2 కి. మీ. మాత్రమే ప్రయాణించే వీలుంది.
Top 5 Countries
1) మెక్సికో సిటీ (మెక్సికో): 10 కి.మీ ప్రయాణానికి 35 నిమిషాల 50 సెకన్లు.
2) బెంగళూరు (భారతదేశం): 10 కి.మీ ప్రయాణానికి 36 నిమిషాల 09 సెకన్లు.
3) డబ్లిన్ (ఐర్లాండ్): 10 కి.మీ ప్రయాణానికి 29 నిమిషాల 30 సెకన్లు.
4) లాడ్జ్ (పోలాండ్): 10 కి.మీ ప్రయాణానికి 25 నిమిషాల 10 సెకన్లు.
5) పుణె (భారతదేశం): 10 కి.మీ ప్రయాణానికి 31 నిమిషాల 40 సెకన్లు.
భారతదేశంపై నివేదికలోని ముఖ్యాంశాలు
బెంగళూరు నెమ్మదైన నగరం:
బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 36 నిమిషాల పైనే సమయం పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 2 నిమిషాలు పెరిగింది.
పెరిగిన ఇంధన ఖర్చులు:
ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనదారులు ఇంధనం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బెంగళూరులో ఏడాదికి సగటున 168 గంటలు ట్రాఫిక్‌లోనే వృథా అవుతున్నాయి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

