Dharna demanding release of job calendar in telangana

Job calendar – జాబ్ కేలండర్ విడుదల చేయాలంటూ ధర్నా

BIKKI NEWS (JAN. 08) : Dharna demanding release of job calendar in Telangana. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ ఈరోజు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేశారు.

Dharna demanding release of job calendar in Telangana

అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులు ఒక్కసారిగా ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి, రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేశారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →