Contract employees service count from date of regularization bill

ఉద్యోగుల సర్వీస్ పై శాసనసభలో కీలక బిల్లు ఆమోదం

BIKKI NEWS (JAN. 04) : contract employees Service count from date of regularization bill. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కీలక బిల్లుకు ఆమోదం కలిగింది. ఈ బిల్లు ఆమోదంతో తాత్కాలిక ఉద్యోగులు క్రమబద్ధీకరించబడిన తేదీ నుండే సర్వీసును లెక్కలోనికి తీసుకుంటారు.

contract employees Service count from date of regularization bill

తెలంగాణ(ప్రభుత్వ సేవల నియామకాల క్రమబద్ధీరణ, సిబ్బంది తీరును, వేతన స్వరూపాన్ని హేతుబద్ధీకరించడం) రెండో సవరణ బిల్లు 2026 కు శాసనసభ ఆమోదం లభించింది.

దీంతో రాష్ట్రంలో కాంట్రాక్టు, పార్ట్ టైం, హవర్లీ బేసిస్, క్యాజువల్, డైలీ వేజేస్ వంటి పేర్లతో పని చేస్తూ క్రమబద్ధీకరించబడిన ఉద్యోగులకు సర్వీసును క్రమబద్ధీకరించబడిన తేదీ నుండి మాత్రమే కల్పించనున్నారు.

తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన కాలాన్ని సర్వీసులోనికి తీసుకోవడానికి వీలు లేకుండా ఈ బిల్లులో మార్పులు చేశారు.

కొందరు క్రమబద్దీకరించబడిన ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి తాము తాత్కాలికగా పనిచేసిన సర్వీసును కూడా కలపాలని అభ్యర్థించడంతో హైకోర్టు తాత్కాలిక ఉద్యోగులకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →