INEQULITY INDEX – 58% దేశ సంపద 10% మంది దగ్గరే

Inequlity index - 58% దేశ సంపద 10% మంది దగ్గరే - bikki news

BIKKI NEWS (DEC. 13) : World inequality index 2026. ప్రపంచ అసమానతల సూచిక 2026 విడుదల చేశారు. దీని ప్రకారం ప్రపంచంలో అసమానతలు వీపరీతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

World inequality index 2026 in Telugu

దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రరూపం దాల్చుతున్నాయని, తక్కువ సగటు ఆదాయంతో ప్రపంచంలోనే అత్యధిక అసమానతలున్న దేశంగా భారత్ నిలిచిందని ప్రపంచ అసమానతల సూచిక నివేదిక వెల్లడించింది. గత పదేళ్లలో అసమానతలు అధిగమించడంలో ఎలాంటి ప్రగతి లేదని, కార్మిక బలగంలో మహిళల ప్రాధాన్యం పెరగలేదని పేర్కొంది.

దేశంలో టాప్ 10% మంది చేతుల్లో దాదాపు 40.01% సంపద ఉందని తెలిపింది.

జాతీయ ఆదాయంలో 58% వీరి వద్ద ఉందని తెలిపింది.

అట్టడుగు నుంచి 50% మంది వద్ద 15 శాతమే సంపద ఉందని వివరించింది.

పరిపాలన, విధానాల వైఫల్యాలతో అసమానతలు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది.

ప్రపంచంలో 0. 001% మంది మల్టీ మిలియనీర్లు ప్రపంచంలోని 50% మంది కన్నా మూడింతలు అధిక సంపద కలిగి ఉన్నారు. వారు 1995లో 4% ఉంటే.. ఇప్పుడు 6 శాతానికి పెరిగారు.

అసమానతలు తగ్గించేందుకు రాజకీయ సంకల్పం అవసరం. సంపద తిరిగి పంపిణీ చేయడం, పారదర్శక పన్నులు, విద్య వైద్యం, ఆరోగ్యంపై సామాజిక పెట్టుబడులు పెంచడం ద్వారా తగ్గించవచ్చు.

ధనికులపై సంపద పన్ను లతో విద్య, ఆరోగ్యం, వాతావరణంపై పెట్టుబడులు పెంచవచ్చు.

ఉచిత, నాణ్యత కలిగిన విద్య, అందరికీ వైద్యం, చిన్నారుల సంరక్షణ, పోషకాహార పథకాలు అమలు.

నగదు బదిలీ, పింఛన్లు, నిరుద్యోగ భృతి, బీద కుటుంబాలకు సహాయంతో వనరులను పైనుంచి కింది స్థాయికి బదిలీ చేయాలి.

అభివృద్ధి చెందిన దేశాలు చౌకగా, వేగంగా రుణాలు తీసుకుంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక వడ్డీలతో కూడిన అప్పుల అప్పులు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు కేంద్రీకృత క్రెడిట్, డెబిట్ వ్యవస్థ, మిగులు నిల్వలపై పన్నుల్లో మార్పులు చేయాలి” అని నివేదికలో పేర్కొంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →