BIKKI NEWS (OCT. 24) : SILVER LOAN FROM BANKS SAYS RBI. వెండి ఆభరణాలనూ హామీగా ఉంచి లోన్ తీసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది 2026 ఏప్రిల్ 1 నుంచి అన్ని 60 వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు ఈ రుణాలు అందించేందుకు మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది.
SILVER LOAN FROM BANKS SAYS RBI.
తాకట్టు పెట్టే వెండి విలువ ఆధారంగా బ్యాంకులు ఇచ్చే రుణాన్ని ‘లోన్-టు-వాల్యూ నిష్పత్తి అంటారు. దీనిపై ఆర్బీఐ స్పష్టమైన పరిమితులు విధించింది.
రూ.2.5 లక్షల వరకు తీసుకునే రుణానికి, వెండి మార్కెట్ విలువలో 85% వరకు రుణం పొందొచ్చు.
రూ.2.5- 5 లక్షల మధ్య రుణానికి, వెండి విలు వలో 80%, రూ.5 లక్షలకు పైబడిన రుణాలకు 75% అందిస్తారు.
ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వరకూ వెండిని హామీగా ఉంచొచ్చు. గరిష్ఠంగా 500 గ్రాముల బరువున్న వెండి నాణేలను మాత్రమే అనుమతిస్తారు.
వెండి ఆభరణాలు, నగలు, నాణేలపై మాత్రమే రుణం తీసుకోవచ్చు. వెండి కడ్డీలు, ఈటీఎఫ్ లు తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం సాధ్యం కాదు. వెండిని కొనేందుకూ బ్యాంకులు రుణాలు ఇవ్వవు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
