BIKKI NEWS (OCT. 02) : TET 2025 NOVEMBER NOTIFICATION. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నవంబర్ సెషన్ నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
TET 2025 NOVEMBER NOTIFICATION.
దీనికి ప్రధాన కారణం సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్లకు కచ్చితంగా టెట్ అర్హత ఉండాల్సిందేనని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని జీవో 36 లో సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనిలో కచ్చితంగా టీచర్లు టెట్ కు అర్హత సాధించాలని పేర్కొనాల్సి ఉంటుంది.
టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 30,000 వరకు ఉండవచ్చని అంచనా. 5 సంవత్సరాల లోపు పదవి విరమణ వారికి టెట్ అర్హత నుండి మినహాయింపులను సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే వీరికి ఎలాంటి పదోన్నతులు లభించవు.
ఈ నేపథ్యంలో టెట్ అర్హతపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ నేపద్యంలో టెట్ నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వం, విద్యాశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉపాధ్యాయులు సందిగ్ధంగా ఎదురుచూస్తున్నారు.