ELECTION CODE – బదిలీలు పదోన్నతులపై నిషేధం

BIKKI NEWS (SEP. 30) : Telangana election code ban on transfers and promotions. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Telangana election code ban on transfers and promotions

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడి ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపింది.

స్థానిక ఎన్నికలు జరగనున్న 31 జిల్లాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు సంబంధించి సన్నాహాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. పోలింగ్ శాంతియుత వాతావరణంలో జరగటానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు మించి పిల్లలు ఉన్నట్లయితే పోటీ చేయడానికి అనర్హులని గతంలో తీసుకువచ్చిన నిబంధన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK