BIKKI NEWS (SEP. 29) : PANCHAYATI ELECTIONS SCHEDULE RELEASED. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.
PANCHAYATI ELECTIONS SCHEDULE RELEASED.
అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముందు MPTC, ZPTC ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు.
పంచాయతీలకు మూడు దశలతో కలిపి మొత్తం ఐదు దశల్లో పోలింగ్ ఉంటుందని, ప్రతి ఫేజ్ 15రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు.
షెడ్యూల్ వెల్లడించడంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్ తెలిపింది..
MPTC ZPTC SCHEDULE
మొదటి విడత: అక్టోబర్ 9న నామినేషన్లు.. 23న పోలింగ్
రెండో విడత: అక్టోబర్ 13న నామినేషన్లు.. 27న పోలింగ్
నవంబర్ 11న MPTC, ZPTC కౌంటింగ్
గ్రామ పంచాయతీల షెడ్యూల్
ఫేజ్ 1: అక్టోబర్ 17న నామినేషన్లు.. 31న పోలింగ్, ఫలితాలు
ఫేజ్ 2: అక్టోబర్ 21వ తేదీకి నామినేషన్.. నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు
ఫేజ్ 3: అక్టోబర్ 25న నామినేషన్., నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు