3 దశల్లో పంచాయతీ, 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

BIKKI NEWS (SEP. 27) : Telangana panchayati elections schedule. తెలంగాణ రాష్ట్రంలో 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Telangana panchayati elections schedule.

రాష్ట్రంలో 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు.

రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

565 మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీలు), 31 జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,67,03,168 మంది ఓటర్లలో 85,36,770 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు.. 504 మంది ఇతరులు ఉన్నారు.