BIKKI NEWS (SEP. 25) : Mid day meals proposals in govt junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు యూనిఫామ్ కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.
Mid day meals proposals in govt junior colleges.
ఇంటర్మీడియట్ విద్యలో యోగ, క్రీడలు, ప్రాక్టికల్ ల్యాబ్స్ వారంలో ఒక రోజు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో దసరా తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని కళాశాలలో ఆన్లైన్ తరగతులను బోధించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కళాశాలకు నాలుగు చొప్పున ఇంటరాక్టివ్ పానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అధ్యాపకుల కొరత ఉన్న చేత వాలంటీర్ల చేత విద్యాబోధన చేపిస్తామని తెలిపారు.
ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన విద్యార్థుల ఫోటోలను కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పారిశుధ్య నిర్వహణ కోసం 5.5 కోట్ల రూపాయలు రానున్నట్లు తెలిపారు.
శంషాబాద్ జూనియర్ కళాశాలకు చెందిన 12 ఎకరాల స్థలంలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు.