DIGITAL SCREENS – త్వరలోనే ఇంటర్ కళాశాలలకు డిజిటల్ స్క్రీన్ లు

BIKKI NEWS (SEP. 22) : Digital screens to government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో త్వరలోనే డిజిటల్ స్క్రీన్ లను అమర్చనున్నారు ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లును ఇంటర్ బోర్డు పూర్తి చేసింది.

Digital screens to government junior colleges.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడమే లక్ష్యంగా మరియు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్ వంటి ఆన్లైన్ తరగతులను అందించడానికి ఈ డిజిటల్ స్క్రీన్లు ఉపయోగపడమన్నాయి.

ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్ , క్లాట్ వంటి కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందించడానికి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే కళాశాలలో ప్రస్తుతం ఉన్న ప్రొజెక్టర్ల సహాయంతో డిజిటల్ తరగతుల బోధన జరుగుతుంది. విద్యార్థులకు మరింత నాణ్యతతో కూడిన డిజిటల్ బోధన అందించడానికి తరగతి గదులలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యాబోధన మరింత ప్రభావవంతంగా ఉండనుంది.