టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి వినతి : పింగిలి శ్రీపాల్ రెడ్డి

BIKKI NEWS (SEP. 21) : Requesting for exemption of teachers from Teachers. ఇన్ సర్వీస్ టీచర్స్ కి టెట్ నుండి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు PRTU TS వినతి అందించడం జరిగింది.

Requesting for exemption of teachers from Teachers

ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సర్వీస్ రూల్స్ అమలుపరుచుటకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని గౌరవ మంత్రివర్యుల ను కోరారు.

వారు స్పందిస్తూ త్వరలోనే కేంద్ర విద్యా శాఖ మంత్రివర్యులు ధర్మేణ ప్రసాద్ గారిని కలిసి వారికి తెలియపరచడానికి మీకు సహకారం అందిస్తానని తెలిపారు.

In-service టీచర్స్ కి టెట్ మినహాయింపు మరియు ఏకీకృత సర్వీస్ అమలు కావడానికి పూర్తిగా సహకారం అందిస్తానని తెలిపినందుకు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.

నూనతనంగా ఎన్నికైన గౌరవ MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారిని గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి బాధ్యులు నవీన్ రెడ్డి,గిరిధర్ గార్లు పాల్గొన్నారు.