DASARA HOLIDAYS – 25 నుంచి కళాశాలలకు సెలవు ఇవ్వాలని వినతి

BIKKI NEWS (SEP.19) : Requesting for Dasara holidays to inter colleges from 25th. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెప్టెంబర్ 25 నుంచి దసరా సెలవులను ప్రకటించాలని వివిధ సంఘాల నాయకులు ఇంటర్ డైరెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించారు.

Requesting for Dasara holidays to inter colleges from 25th.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు కలవు.

అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పండగ అయినా బతుకమ్మ , దసరాకు సంబంధించిన సంబరాలు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించేలా సెప్టెంబర్ 25 నుండి దసరా సెలవులను మార్పు చేయాలని ఇంటర్ డైరెక్టర్ కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రాలను సమర్పించడం జరిగింది. దీనిపైన ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇప్పటికే తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ కూడా సెప్టెంబర్ 28 నుంచి ఉన్న సెలవులను సెప్టెంబర్ 25 నుండి ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు నిర్ణయం పై సందిగ్ధత నెలకొంది.