BIKKI NEWS (SEP. 19) : DASARA HOLIDAY ONLY ONE WORKING DAY TO INTER COLLEGES. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఈ ఏడాది దసరా సెలవులు కేవలం ఒక్క రోజు మాత్రమే… అంటే కేవలం ఒక్క వర్కింగ్ డే మాత్రమే దసరా సెలవులలో ఉండటం విశేషం.
DASARA HOLIDAY ONLY ONE WORKING DAY TO INTER COLLEGES
ఇంటర్మీడియట్ కళాశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించారు. అంటే ఆదివారం నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు.
అయితే ఇందులో ఎక్కువగా పబ్లిక్ హాలీడేస్ మరియు ఆప్షనల్ హాలీడేస్ ఉండడం, కేవలం ఒక్క రోజు మాత్రమే వర్కింగ్ డే ఉండడం విశేషం.
కేవలం సెప్టెంబర్ 29 మాత్రమే వర్కింగ్ డే కాగా… మిగతా రోజులు పబ్లిక్, ఆప్షనల్ హాలీడేస్ కావడం విశేషం.
- 28 సెప్టెంబర్ : ఆదివారం
- 29 సెప్టెంబర్ : వర్కింగ్ డే
- 30 సెప్టెంబర్ : దుర్గాష్టమి (ఆప్షనల్ హాలిడే)
- 01 అక్టోబర్ : మహర్నవమి (ఆప్షనల్ హాలిడే)
- 02 అక్టోబర్ : గాంధీ జయంతి/ విజయదశమి (పబ్లిక్ హాలీడే)
- 03 అక్టోబర్ : దసరా తర్వాత రోజు (పబ్లిక్ హాలీడే)
- 04 అక్టోబర్ : యాజ్దహోమ్ షరీఫ్ (ఆప్షనల్ హాలిడే)
- 05 అక్టోబర్ : ఆదివారం
పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 03 వరకు సెలవులు ప్రకటించారు.
అయితే తాజాగా సాంకేతిక విద్యా శాఖా కూడా తమ పరిధిలోని పాలిటెక్నిక్ మరియు ఫార్మా కళాశాలలకు సెప్టెంబర్ 25 నుంచి దసరా సెలవులు ప్రకటించింది.