BIKKI NEWS (SEP. 19) : Engineering fee may declare this month. తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన ఫీజుల వివరాలు పై ఈనెలాఖరులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రవేశాలు మరియు ఫీజుల నియంత్రణ కమిటీ నుంచి కీలక సమాచారం.
Engineering fee may declare this month
కళాశాలలో కల్పించే సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాల ఆధారంగా ఫీజులను నిర్ణయించాలని ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే పలు ధపాలుగా కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఫీజుల పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మ. త్వరలోనే తుది సమావేశాన్ని నిర్ణయించి ఫీజుల పెంపు వివరాలను ప్రభుత్వానికి అందజేయనుంది.
ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కళాశాల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లడంతో… హైకోర్టులో కళాశాలల నాణ్యత ప్రమాణాల ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. దీంతో ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉంది. కాకుంటే భారీగా కాకుండా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
కళాశాలలు కల్పించే ప్రమాణాలు, సౌకర్యాలు ఆధారంగా ఫీజులు నిర్ణయించడంతో నాసిరకం కళాశాలలకు ఫీజులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.