BIKKI NEWS (SEP. 19) : TGSRTC Special bus charges 50% hike. తెలంగాణ ఆర్టీసీ దసరా, బతుకమ్మ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులలో 50 శాతం అదనంగా టికెట్ ధరను కేటాయించారు.
TGSRTC Special bus charges 50% hike.
ఈ పండుగ సీజన్ లో భారీగా ప్రయాణాలు ఉండనున్న నేపథ్యంలో 7,854 అదనపు బస్ సర్వీసులను నడపనున్నారు. వీటిల్లో 50% అదనపు చార్జీలను తీసుకుంటారు .
సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పలుమార్గాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టిసి ప్రకటించింది.
అయితే రోజువారి తిరిగే రెగ్యులర్ బస్ సర్వీసుల్లో చార్జీలు యధాతధంగా ఉండనున్నాయి..