BIKKI NEWS : DAILY GK BITS – 28 FOR COMPITITIVE EXAMS – పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS – 28 FOR COMPITITIVE EXAMS
1) 2020 టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఎన్ని పథకాలను గెలిచింది.?
జ : 48వ స్థానం, 7 పథకాలు (G – 2, S – 2, B – 4)
2) జాతీయ అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటించవచ్చు.?
జ : 352
3) ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF యొక్క పూర్తి నామము ఏమిటి.?
జ : మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ
4) కాయలు త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : ఇథిలిన్
5) విటమిన్ B12 లో ఉండే లోహం ఏమిటి.?
జ : కోబాల్ట్
6) 1953లో DNA నిర్మాణాన్ని (డబుల్ హెలిక్స్) కనుగోన్నది ఎవరు.?
జ : వాట్సన్ & క్రిక్
7) 1965లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : హొనాలులు (హవాయి) (అమెరికా)
8) భారతదేశ మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. దాని పేరు ఏమిటి?
జ : ఆర్యభట్ట
9) 1953లో భాషా ప్రయోక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను పరిశీలనకు నియమించిన కమిటీ పేరు ఏమిటి?
జ: ఫజల్ అలీ కమిషన్
10) రామన్ మెగాసేసి అవార్డును ఏ దేశ ప్రభుత్వం ఇస్తుంది.?
జ : ఫిలిప్పీన్స్
11) జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు ఎవరు.?
జ : విశ్వనాథ సత్యనారాయణ సి.నారాయణరెడ్డి రావూరి భరద్వాజ
12) చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే కాలం.?
జ : 1.3 సెకన్లు
13) భూమి పై ఋతువులు ఎర్పడడానికి కారణం ఏమిటి.?
జ : భూపరిభ్రమణం
14) రాజ్యంగంలో ఏ ప్రకరణలో ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది.?
జ : 51A
15) భారత రాజ్యాంగాన్ని అర్థ సమాఖ్య గా ఎవరు వర్ణించారు.?
జ : కేసీ. వేర్
16) ప్రోటీన్లు లోపం వలన వచ్చే వ్యాధి ఏమిటి.?
జ : క్వాషియార్కర్
17) నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది.?
జ : బుర్ర కథ
18) LPG గ్యాస్ సిలిండర్ లో ఉండే రసాయనం ఏమిటి.?
జ : బ్యూటేన్ & ప్రోపేన్
19) జోరాస్ట్రియన్ (పార్శీ) మతం యొక్క పవిత్ర గ్రంథం ఏది.?
జ: జెండా అవెస్టా
20) “ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్” అనే గ్రంథ రచయిత ఎవరు.?
జ : బాలగంగాధర్ తిలక్
21) రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి.?
జ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
22) మానవ శుక్రకణాల జీవిత కాలం ఎన్ని గంటలు.?
జ : 72 గంటలు
23) పచ్చిక బీడులపై పుల్లరి అనే పన్నును విధించిన రాజులు ఎవరు.?
జ : కాకతీయులు
24) నూతన రాష్ట్రాల స్థాపన లేదా ఏర్పాటు ను సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 2
25) అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : మనీలా (ఫిలిఫ్పైన్స్ )
26) “లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్” ఎవరి ఆత్మకథ.?
జ : నెల్సన్ మండేలా
27) ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు.?
జ : గౌతమ బుద్ధుడు
28) బ్యాంకులను జాతీయకరణం చేసిన ప్రధానమంత్రి ఎవరు.?
జ : ఇందిరాగాంధీ
29) తెలంగాణ లో భారజల కర్మాగారం ఎక్కడ ఉంది.?
జ : మణుగూరు
30) హరప్పా నాగరికత ఏ నది ఒడ్డున వెలసింది.?
జ : రావి