BIKKI NEWS (SEP. 16) BSc Agriculture special quota counselling 2025. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) 2025-26 విద్యా సంవత్సరానికి Bi.P.C స్ట్రీమ్ ప్రత్యేక కోటాలో అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
BSc Agriculture special quota counselling 2025.
ఎఫ్‌సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ లో ఆధారంగా కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేసారు.
24 సెప్టెంబర్ : 173 నుంచి 6000 వరకు ర్యాంక్ ఉన్న అభ్యర్థులకు
25 సెప్టెంబర్ : 6002 నుంచి 9000 వరకు
26 సెప్టెంబర్ : 9002 నుంచి 12500 వరకు
27 సెప్టెంబర్ : 12503 నుంచి 15996 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు 15997 నుంచి 26000 వరకు (కేవలం అగ్రికల్చర్ లేబరర్ల, రైతు, గ్రామీణ కోటా అభ్యర్థులకు)
కౌన్సెలింగ్ వేదిక : విశ్వవిద్యాలయ ఆడిటోరియం, PJTAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
వివిధ కోర్సుల ఖాళీ సీట్ల వివరాలు :
- B.Sc.(Hons.) Agriculture: 401
- B.Sc.(Hons.) Community Science: 5
- B.Tech.(Food Technology): 5
- B.Sc.(Hons.) Horticulture: 54
ఫీజు వివరాలు : ప్రతి సెమిస్టర్ రూ.62,500/-. మొత్తం నాలుగు సంవత్సరాల్లో రూ.5,00,000/- (ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్, మెస్ డిపాజిట్లు అదనంగా)
విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, సాంఘిక స్థితి సర్టిఫికెట్, పటాదార్ పాస్‌బుక్ లేదా తహసీల్దార్ సర్టిఫికేషన్ వంటి వాటితో కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : www.pjtau.edu.in