PB BSc Nursing – బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

BIKKI NEWS (SEP. 16) : BSc Nursing and PB BSc Nursing admissions 2025. కాళోజి హెల్త్ యూనివర్సిటీ 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ నర్సింగ్ (నాలుగు సంవత్సరాలు), పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (రెండు సంవత్సరాల) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

BSc Nursing and PB BSc Nursing admissions 2025

కాంపీటెంట్ అథారిటీ కింద అడ్మిషన్ల ను చేపట్టడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెప్టెంబర్ 16 నుంచి 30 సాయంత్రం 5.00 గంటల వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

నర్సింగ్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. మరియు తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 లో అర్హత సాధించిన వారు అర్హులు.

  • జనరల్ కేటగిరీ : 40599 ర్యాంక్ లోపు వారు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ (PwD – SC, ST, BC) – 48,718 ర్యాంక్ లోపు వారు
  • OC – PwD – 44,658 ర్యాంక్ లోపు వారు

పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు ఫీజు : 2500/- (ఎస్టీ, ఎస్సీ లకు 2000/-)

దరఖాస్తు లింక్ : https://tsparamed.tsche.in/

వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in