BIKKI NEWS (SEP. 07) : Sanction Increments and Promotions according to contract service – High court. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియామకమై వారి సర్వీస్ క్రమబద్ధీకరణ గావించిన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు మరియు అర్హత ఉన్నవారికి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.
Sanction Increments and Promotions according to contract service – High court.
వి. వెంకటస్వామి మరియు ఇతరులు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేసులో ఈ తీర్పును గౌరవ న్యాయమూర్తి సురేపల్లి నందా ఇవ్వడం జరిగింది.
2023 మే 29న కాంట్రాక్ట్ సర్వీస్ లో నియామకం అయిన వీరికి కాంట్రాక్ట్ సర్వీస్ను పరిగణలోకి తీసుకొని ఇంక్రిమెంట్లు పదోన్నతులు మరియు అర్హతను అనుసరించి పాత పెన్షన్ పద్ధతిని కూడా అమలు చేయాలని ఎప్రిల్ 24 – 2025 లో ఇచ్చిన ఈ తీర్పులో పేర్కొన్నారు.
హైకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పులో, పిటిషనర్ల సేవలు రెట్రోస్పెక్టివ్‌గా 29.05.2003 నుండి సాధారణీకరించాలని అధికారులను ఆదేశించింది.
2023లో వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను జీవో నెంబర్ 38 ప్రకారం రెగ్యులర్ చేయడం జరిగింది. వీరు తమ కాంట్రాక్ట్ సర్వీస్ ను పరిగణలోకి తీసుకొని ఇంక్రిమెంట్లు, పదోన్నతులు మరియు పాత పెన్షన్ పద్ధతి అమలు గురించి హైకోర్టుకు వెళ్లడం జరిగింది.
ఉద్యోగుల నిర్వహణలో ముఖ్యమైన ఈ న్యాయ తీర్పు ప్రకారం, వారి ప్రాథమిక నియామక తేదీ నుండి వారిని సర్వీసులలో కలిపి, వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ లు, పదోన్నతులు మరియు పాత పెన్షన్ స్కీమ్ హక్కులు కల్పించాల్సి ఉంటుంది
తీర్పులోని ముఖ్యాంశాలు
- పిటిషనర్ల సాధారణీకరణను 29.05.2003 నుండి పరిగణించాలి.
- వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్స్, పదోన్నతులు, పాత పెన్షన్ స్కీమ్ లాభాలను వారి నియామక తేదీ నుండి అమలుచేయాలి.
- ఈ ఆదేశాన్ని అందుకున్న నాలుగు వారాల్లోపుగా అధికారుల నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలి.
- మునుపటి సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.