BIKKI NEWS (Nov. 27) : TSCPSEU Sthitha Pragna met CS today About CPS to OPS. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, IAS గారిని సచివాలయంలో TSCPSEU రాష్ట్ర అధ్యక్షులు జి. స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కలిసి 2.80 లక్షల CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
TSCPSEU Sthitha Pragna met CS today About CPS to OPS
భేటీలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు
1. CPS రద్దు – OPS పునరుద్ధరణ: కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు తక్షణమే OPS అమలు చేయాలి.
2. OPS ఆర్థిక సాధ్యాసాధ్యాలు: ప్రభుత్వంపై అదనపు భారం లేకుండా OPS అమలు సాధ్యమని ఆర్థిక గణాంకాలతో సహా వివరించడం జరిగింది.
3. పెండింగ్ DA అరియర్స్: 46 పెండింగ్ ఇన్స్టాల్మెంట్లతో పాటు ₹15,000 పరిమితి వల్ల నిలిచిపోయిన అరియర్స్ను ఏకమొత్తంగా విడుదల చేయాలి.
4. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు – G.O.Ms.No.60 ద్వారా గ్రాట్యుటీ, G.O.Ms.No.58 ద్వారా ఫ్యామిలీ పెన్షన్ అమలు చేయాలి.
5. OPS అధ్యయన కమిటీ, రాష్ట్రస్థాయి EHS కమిటీలలో TSCPSEUకు అధికారిక స్థానం కల్పించాలి..
సీఎస్ సానుకూల స్పందించారు
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినట్లు సంఘ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీబ్ మల్లికార్జున్, రవిచంద్ర,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు,మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు చంద్ర కాంత్ లు పాల్గొన్నారు.

