BIKKI NEWS (Nov. 26) : Constitution day celebrations in Kallem village. కళ్ళెం గ్రామం లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Constitution day celebrations in Kallem village
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దళితరత్న డా.మబ్బు పరశురామ్ మాట్లాడుతూ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగ హక్కులను,విధులను ఉపయోగించుకుంటూ సమసమాజ నిర్మాణ కోసం యువత ముందు వరుసలో ఉండాలని, రాజ్యాంగ విలువలను అందరికీ అందించాలని మాట్లాడారు.
అలాగే కార్యక్రమంలో సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి, ఉప సర్పంచ్ ఆరె సంపత్,మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాస్ రెడ్డి,AMC మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు,పాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడు జిల్లాల పాపిరెడ్డి,దేస్థాన ఛైర్మన్ జిల్లాల వెంకట్ రెడ్డి, సంఘం పెద్దలు మబ్బు ఆదాం, స్నేహా యూత్ అధ్యక్షుడు తిప్పారపు ప్రసాద్ మరియు ప్రజా ప్రతినిధులు అందరూ రాజ్యాంగ విలువలను గూర్చి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో యువత, గ్రామ ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

