NCS One Portal Launch 2026 For all job notifications – దేశవ్యాప్తంగా ఒకే జాబ్ పోర్టల్

Ncs one portal launch 2026 for all job notifications

BIKKI NEWS (Nov. 23) : NCS One Portal Launch 2026 For all job notifications. ఉద్యోగాల కోసం వేర్వేరు వెబ్‌సైట్లు, ఏజెన్సీల చుట్టూ తిరిగే పనిలేకుండా దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ తీపికబురు అందించింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ వేదికలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేరుస్తూ ‘నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) వన్ పోర్టల్’ ను, ఏ రంగంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందో ముందే తెలిపే ‘ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్ (OSI)’ ను కేంద్రం ప్రారంభించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

NCS One Portal Launch 2026 For all job notifications

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అన్ని రాష్ట్రాల కార్మిక మంత్రులతో జరిగిన రెండు రోజుల సమావేశం (చింతన్ శివిర్) ముగింపు సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వీటిని ఆవిష్కరించారు. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్‌సీఎస్ వన్ పోర్టల్ & కొత్త సూచీతో ప్రయోజనాలు ఇవే!

  • ఒకే వేదికపైకి అన్ని ఉద్యోగ పోర్టళ్లు: ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోర్టళ్లు, ప్రైవేట్ జాబ్ సైట్లు, కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్స్ వేర్వేరుగా ఉండేవి. ఇకపై వీటన్నింటినీ ఎన్‌సీఎస్ వన్ పోర్టల్ అనుసంధానిస్తుంది. చదువు తక్కువగా ఉన్నవారు లేదా సాంకేతికతపై అవగాహన లేనివారు కూడా సులభంగా ఉద్యోగాలు వెతుక్కునేలా ఇందులో మాట్లాడే (వాయిస్ బాట్), చాట్ చేసే సదుపాయాలు కల్పించారు.
  • ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్ (OSI): మార్కెట్లో కంపెనీలకు ఎలాంటి నిపుణులు కావాలి, మన దగ్గర ఎంతమంది అందుబాటులో ఉన్నారనే లెక్కలను ఓఎస్ఐ సూచీ ఎప్పటికప్పుడు బయటపెడుతుంది. దీనివల్ల యువత డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుని ఉద్యోగాలు పొందడానికి, కాలేజీలు అందుకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడానికి వీలవుతుంది.
  • ఈ-శ్రమ్ లైవ్లీహుడ్ మాడ్యూల్ (e-Shram Livelihood Module): రోజువారీ కూలీలు, అసంఘటిత కార్మికుల ఉపాధి వివరాలు నమోదు చేయడంతో పాటు వారికి ఉచిత రేషన్, ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమాలు, పెన్షన్ వంటి 5 ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఈ మాడ్యూల్‌ను తెచ్చారు.
NCS One Portal Launch 2026 For all job notifications
  • ఉచిత కెరీర్ కౌన్సెలింగ్: యువతకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు సహా 8 నగరాల్లో ‘కెరీర్ లాంజ్’ (Career Lounge) లను ప్రారంభించారు. త్వరలో చిన్న పట్టణాల్లోనూ కలిపి దేశవ్యాప్తంగా 200 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉచిత కెరీర్ కౌన్సెలింగ్, నైపుణ్య పరీక్షలు, ఇంటర్న్‌షిప్‌లతో పాటు విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారికి అక్కడి భాషలు, నిబంధనలపై అవగాహన కల్పిస్తారు.
  • కార్మిక వివాదాల పరిష్కారం & EPF, ESIC సేవలు: కార్మిక వివాదాలు కోర్టుల మెట్లు ఎక్కకుండా ముందే పరిష్కరించేలా న్యాయవాదులకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు. అలాగే ఈపీఎఫ్ (EPF), ఈఎస్ఐసీ (ESIC) సేవలను మరింత సరళతరం చేయడంపై కూడా ఈ భేటీలో చర్చించారు.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →