BIKKI NEWS (Nov. 14) : India won U19 Asia Cup 2026. అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ లో భారత్ ఓటమి తప్పని స్థితి నుంచి MANAL and MOHIT వీరోచిత పోరాటంతో పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించి ఆసియా కప్ సొంతం చేసుకుంది.
India won U19 Asia Cup 2026
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ యుధ జట్టు 347 పరుగులు సాధించింది. ఉస్మాన్ ఖాన్ 107, ఖాదిర్ 80, యూసఫ్ 63 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ 4, వెంకట 3 వికెట్లు తీశారు. చివరి 10 ఓవర్ లలో భారత్ బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ ను కట్టడి చేశారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత యువ జట్టు కెప్టెన్ రాయ్ చందాని 80, ఆర్యవీర్ సెహ్వాగ్ 58 పరుగులతో పటిష్ట ఆరంభం ఇచ్చారు. కానీ తర్వాత వరుస విరామాలలో వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్ లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగుల వద్ద ఓటమి అంచుల్లో నిలిచింది.
ఈ సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన మనాల్ చౌహాన్, మొహిత్ కలిసి చివరి వరకు పోరాడి విజయం అందించారు. భారత్ కు ఆసియా కప్ ను అందించారు.

