BIKKI NEWS (AUG. 29) : International day against Nuclear Tests. అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
International day against Nuclear Tests
అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది.
2009, డిసెంబరు 2న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 64వ సెషన్ లో 64/35 తీర్మానం ద్వారా ఈ దినోత్సవం ప్రతిపాదించబడి, ఏకగ్రీవంగా ఆమోదించబడింది.