BIKKI NEWS (SEP. 25) : High court orders on Annual grade increments for DLs తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2023 బ్యాచ్ డిగ్రీ లెక్చరర్ లకు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లు (Annual Grade Increments) వెంటనే విడుదల చేసి చెల్లించాలని తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది..
High court orders on Annual grade increments for DLs
తెలంగాణ హైకోర్టులో WP No. 31485 of 2026కు సంబంధించి మధ్యంతర ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కేసును గౌరవ న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ విచారించారు.
పిటిషనర్ల తరఫున దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు రెండో, మూడో వార్షిక ఇంక్రిమెంట్ల విడుదలకు సంబంధించిన అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
2026 ఆగస్టు 14న జారీ చేసిన Representationను పరిగణనలోకి తీసుకుని, ప్రధాన రిట్ పిటిషన్ WP No.31485 of 2026 తుది పరిష్కారం అయ్యే వరకు పిటిషనర్లకు రావాల్సిన వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లను విడుదల చేయాలని కోరారు.

