BIKKI NEWS (SEP. 23) : 2nd PRC report submitted to Government. తెలంగాణ రాష్ట్ర రెండోవ పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈరోజు పి ఆర్ సి కమిటీ చైర్మన్ శివ శంకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కి అందజేశారు.
2nd PRC report submitted to Government
మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ కానుంది. ఈ భేటీలో పిఆర్సి నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేసే అవకాశం ఉంది.
రెండో పి ఆర్ సి ప్రకటన, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెండింగ్ డీఏ ల చెల్లింపు, పాత పెన్షన్ పద్ధతి అమలు వంటి ముఖ్యమైన నాలుగు డిమాండ్లతో ఉద్యోగ సంఘాల జేఏసీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపనుంది.
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల అనంతరం డిఏల ప్రకటన, పిఆర్సి నివేదిక మీద ప్రకటన చేసే అవకాశం ఉంది.

