BIKKI NEWS (Sep. 08) : new mee Seva centres notification in jangaon district. జనగాం జిల్లాలో 17 కొత్త మీసేవ కేంద్రాలు నెలకొల్పుట మరియు నడుపుట కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
new mee Seva centres notification in jangaon district
స్థానిక అభ్యర్థిత్వం అనేది సంబంధిత మండలం ప్రమాణంగా ఉంటుంది. తదునుగుణంగా, స్థానిక అభ్యర్థిత్వానికి నిర్దేశిత రుజువు దాఖలు మరియు పరిశీలనకు లోబడి అతని/ఆమె స్థానికత/స్వస్థల మండలంలో ప్రతిపాదిత మీసేవా కేంద్రాలకు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అభ్యర్థి అర్హుడు. ఒక మండలం నుండి అభ్యర్ధులు మరొక మండలంలో ప్రతిపాదించిన మీసేవా కేంద్రానికి పరిశీలించబడరు..
మండలం వారీగా ప్రతిపాదించిన మీసేవా కేంద్రాలు
- బచ్చన్నపేట – చిల్పూరు : 8
- దేవరుప్పల – గన్పూర్ : 5
- జనగాం – లింగాల ఘన్పూర్ : 2
- పాలకుర్తి – రఘునాడపల్లి : 2
అర్హతా ప్రమాణాలు
- దరఖాస్తుదారు గ్రాడ్యుయేషన్ లేదా ఆపై విద్యార్హత కలిగి ఉండవలెను
- దరఖాస్తుదారు కంప్యూటర్ సర్టిఫికేషన్ కోర్సు విద్యార్హత కలిగి ఉండవలెను.
- దరఖాస్తుదారు వయస్సు 21 సంవత్సరాలు మరియు 44 సంవత్సరాల మధ్య ఉండవలెను.
- దరఖాస్తుదారు మీసేవ కేంద్రాలు నెలకొల్పుట మరియు నడుపుట కొరకు అవసరమైన మౌలిక వసతులకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండవలెను.
- దరఖాస్తుదారు స్థానిక అభ్యర్థిత్వం యొక్క పరిశీలనకు లోబడి, ప్రతిపాదిత మీసేవా కేంద్రానికి సంబంధిత మండల స్థానికత/సంస్థల అభ్యర్థి ఆయి ఉండవలెను.
- ఎంపిక చేయబడిన అభ్యర్థులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ దాఖలు చేయవలెను/ పొందవలెను.
- దరఖాస్తుదారు స్థానిక మాండలికం మాట్లాడగలిగి, చదవగలిగి, వ్రాయగలిగి ఉండవలెను మరియు ఇంగ్లీషులో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండవలెను.
షెడ్యూలు :
- దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 07 నుంచి 11 వరకు
- దరఖాస్తు పరిశీలన : సెప్టెంబర్ 15 – 2026
- అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్ 17 – 2026
- పరీక్ష తేదీ : 20.09.20126 10.00గం. నుండి మ.12.00గం. వరకు
ఎంపిక అనేది నిర్ణీత వ్రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
అర్హత గల అభ్యర్థులు IDOC మెయిన్ మీటింగ్ హాల్లో 20,09,2028న ఉ. 10.00 గం. నుండి మ. 12:00 గం.వరకు జరిగే వ్రాత పరీక్ష కొరకు హాజరగుటకు అనుమతించబడతారు.
చిరునామా : జిల్లా కలెక్టర్ కార్యాలయం, జనగాం జిల్లా – NIC (రూమ్ నెం.25)లో బాఖలు చేయవలెను.
వెబ్సైట్ : https://jangaon.telangana.gov.in/
